![]() |
![]() |

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప: ది రైజ్' డిసెంబర్ 8న రష్యాలో విడుదలైన సంగతి తెలిసిందే. మూవీ టీమ్ అంతా వెళ్లి అక్కడ భారీగా ప్రమోట్ చేసినప్పటికీ.. ఈ సినిమాకి అక్కడ ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే మేకర్స్ మాత్రం రష్యాలోనూ తగ్గేదేలే అంటూ పుష్ప చిత్రం విశేష ఆదరణ పొందుతోందని తెలుపుతూ సర్ ప్రైజ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

రష్యాలో పుష్ప సినిమా విడుదలై 25 రోజులు పూర్తయిన సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. 774 స్క్రీన్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రం.. ఇప్పటిదాకా అక్కడ 10 మిలియన్ కి పైగా రుబెల్స్ వసూలు చేసినట్లు తెలిపారు. మన కరెన్సీలో దీని విలువ రూ.1.12 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పటికే రష్యాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాగా పుష్ప రికార్డు సృష్టించింది. అలాగే ఇండియన్ సినిమాల పరంగా చూస్తే టాప్-5 లిస్టులోకి చేరిపోయింది. మరి ఫుల్ రన్ లో పుష్ప రాజ్ అక్కడ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
![]() |
![]() |