![]() |
![]() |

తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి జంటగా నటించిన చిత్రం 'నమస్తే సేట్ జీ'. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సాయికృష్ణ దర్శకుడు. కిరాణా షాపుల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, లాక్ డౌన్ లో వారు చేసిన సేవలు గుర్తిస్తూ తీసిన ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ కి ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. "సాయికృష్ణ కి, స్వప్న కి శుభాకాంక్షలు. అసలు సినిమా తీయడం ఒక ఎత్తు, థియేటర్లో విడుదల చేయడం మరొక ఎత్తు, అలాంటిది చిన్న సినిమా లాగా విడుదలై ఈ రోజు థియేటర్లు పెరుగుతూ, ఎంతోమంది ప్రేక్షకుల మనసులు దోచుకున్న పెద్ద సినిమా అవ్వడం మాములు విషయం కాదు. ఇదంతా కేవలం టీం వర్క్ లా సినిమా తీయడం వలనే సాధ్యం అవుతుంది. అలానే మా సాయికృష్ణ త్వరలో సినిమా పరిశ్రమ స్థాయిని పెంచే స్థాయి లో ఉంటాడు. అలానే హీరోయిన్ గా చేసిన స్వప్న చౌదరి కి మంచి భవిష్యత్తు ఉంది. టీం అందరికి శుభాకాంక్షలు" అన్నారు.
హీరో, దర్శకుడు సాయికృష్ణ మాట్లాడుతూ.. "ఈ విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్క కిరాణా షాపు వ్యక్తులకు, ప్రేక్షకులకు, అలాగే మా డిస్ట్రిబ్యూటర్ బాబు గారికి, గణేష్ గారికి, శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే మా విజయం తెలుసుకొని మమ్మల్ని పిలిచి అశీస్సులు తెలిపిన మా గురువు గారు తనికెళ్ళ భరణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే మా హీరోయిన్ స్వప్న చౌదరి, నటుడు శోభన్ భోగరాజు, చింతల శ్రీనివాస్ లకి అభినందనలు" అన్నారు.
హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడుతూ.. "సిల్వర్ స్క్రీన్ మీద కనపడాలి అనేది చిన్నప్పటి నుండి నా కల, మా అమ్మ కోరిక. ఒక్క రోజు ఒక్క షో ఐనా రన్ ఐనా చాలు అనుకున్న మా నమస్తే సేట్ జీ సినిమా వరుసగా రెండో వారంలోకి కూడా ఎంటరైంది. ఇక పోతే సినిమా చూసిన ప్రతి చోట ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి థియేటర్ కి వెళ్లి ప్రేక్షకుల స్పందన తెలుసుకుంటున్నాం. అలానే మమ్మల్ని తనికెళ్ళ భరణి గారు పిలిచి శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు.
![]() |
![]() |