![]() |
![]() |

'రంగస్థలం' చిత్రంలో వినికిడి లోపమున్న చిట్టిబాబు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతలా ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ చిత్రంతోనే చరణ్ లో ఎంత మంచి నటుడు దాగున్నాడో ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడు మరోసారి చరణ్ ఆ తరహా పాత్రలో అలరించనున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా 'RC15' చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ గ్రామీణ యువకుడిగా, ప్రభుత్వ అధికారిగా ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు టాక్. అంతేకాదు ఇందులో గ్రామీణ యువకుడి పాత్రకు నత్తి ఉంటుందని సమాచారం. 'రంగస్థలం'లో లాగ 'RC15'లో కూడా చరణ్ తనదైన నటనతో కట్టి పడేయనున్నాడని అంటున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |