Home

»

Latest News

జనవరిలోనే 'వినోద‌య సిత్తం' రీమేక్ ప్రారంభం!

Dec 16, 2022 4:25PM

మరో ఏడాదిన్నర లోపులో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముండటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ కొంతకాలం సినిమాలకు విరామం ఇస్తాడని.. ఈలోపు ప్రస్తుతం చేతిలో ఉన్న 'హరి హర వీరమల్లు' పూర్తి చేసినా గొప్ప అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ పవన్ మాత్రం ఊహించని విధంగా సినిమాల వేగం పెంచాడు.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'హరి హర వీరమల్లు' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్ తో ఓ చిత్రాన్ని ప్రకటించాడు పవన్. అంతేకాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇటీవల లాంచ్ అయింది. ఇక ఇప్పుడు మరో చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

తమిళ చిత్రం 'వినోద‌య సిత్తం' రీమేక్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ మూవీలో పవన్, సాయి ధరమ్ తేజ్ నటించనున్నారని న్యూస్ వినిపించింది. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సౌండ్ లేదు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడొక సర్ ప్రైజింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రం జనవరిలోనే ప్రారంభం కానుందట. పవన్ ఇలా వరుస సినిమాలను పట్టాలెక్కిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com