Home

»

Latest News

వయసు పెరిగేకొద్దీ అందం కూడా పెరుగుతోందేంటండి బాబు!

Dec 11, 2022 1:14PM

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమెకు యూత్ లో మంచి క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఒక పక్క స్మాల్ స్క్రీన్ మీద చేస్తూ సిల్వర్ స్క్రీన్ మీద వచ్చే అవకాశాలను వినియోగించుకుంటూ దూసుకుపోతోంది. అలాగే షాప్ ఓపెనింగ్స్, ఫారెన్ లో జరిగే ఈవెంట్స్ ఒకటేమిటి అన్నిటికి వెళ్తోంది అనసూయ. 

ఇక ఇప్పుడు రీసెంట్ గా ఒంగోలు ప్రాంతంలోని కర్నూలురోడ్డులో కొత్తగా స్టార్ట్ చేసిన స్వాతి షాపింగ్‌మాల్‌ ఓపెనింగ్ ఫంక్షన్ కి అచ్చమైన తెలుగమ్మాయిలా గ్రాండ్ లుక్ లో వెళ్లి రిబ్బన్ కట్ చేసింది. ఇక ఈమెతో పాటు హనీ ఈజ్ ది బెస్ట్ అనే డైలాగ్ తో ఫేమస్ ఐన హీరోయిన్ మెహరీన్ కూడా షోరూం ఓపెనింగ్ సెరిమనిలో పాలుపంచుకున్నారు. ఒకేసారి ఇద్దరు స్టార్స్ ని చూసేసరికి భారీ ఎత్తున ప్రజలు కూడా తరలి వచ్చారు. 

అనసూయ ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇక నెటిజన్స్ "ఎవరికైనా ఏజ్ పెరిగే  కొద్దీ అందం తగ్గిపోతుంది.. కానీ మీకేంటండి బాబు అందం పెరిగిపోతోంది...మెహ్రీన్ కన్నా మీరే బాగున్నారు.." అని కామెంట్స్ చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com