![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' అనే పీరియాడికల్ ఫిల్మ్ చేస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ లో డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ సందడి చేయడం విశేషం.
మైత్రి బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' అనే చిత్రాన్ని గతంలో పవన్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఆ కథను పక్కన పెట్టి, ఇదే కాంబినేషన్ లో మరో కథతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ లాంచ్ కానుందని, అంతేకాదు ఇది 'తేరి'కి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వీరమల్లు సెట్స్ లో హరీష్, నవీన్, రవి సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే పవన్-హరీష్ కలయికలో మూవీ లాంచ్ కానుందని సమాచారం.

వీరమల్లు సెట్స్ కి వెళ్లిన ఫోటోలను తాజాగా హరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో పవన్ గెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడం, పవన్ విభిన్న పాత్ర పోషిస్తుండటంతో వీరమల్లుపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
![]() |
![]() |