![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. తండ్రికి మహేష్ బాబు అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
అభిమానుల సందర్శనార్థం ఈ మధ్యాహ్నం వరకు కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయా స్టూడియోస్ లో ఉంచారు. తర్వాత పద్మాలయా స్టూడియోస్ నుంచి మహాప్రస్థానానికి కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ రాజకీయ ప్రముఖులతో పాటు తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం 3:45 అంత్యక్రియలు జరిగాయి. అంతిమయాత్ర సమయంలో కళ్ళనిండా నీళ్లతో మాటల్లో చెప్పుల్లేనంత బాధతో మహేష్ కనిపించాడు.
![]() |
![]() |