![]() |
![]() |

ఇటీవల 'సర్దార్' చిత్రంతో ఆకట్టుకున్న కోలీవుడ్ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం 'జపాన్'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజమురుగన్ దర్శకుడు. కార్తి కెరీర్ లో 25వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది.
తాజాగా విడుదలైన 'జపాన్' ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ మెప్పిస్తున్న కార్తి 'జపాన్'లోనూ తన వైవిధ్యాన్ని చూపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ ని బట్టి అర్థమవుతోంది. ఇందులో కార్తి డ్యూయల్ రోల్ అని తెలుస్తోంది. ఫుల్ గా పార్టీ చేసుకొని సోఫా లో పడుకొని కార్తి ఉండగా, గోడకి ఉన్న గోల్డ్ ఫోటో ఫ్రేమ్ లో బంగారపు దుస్తులు, ఆభరణాలతో కార్తి ఫోటో ఉంది.

అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
![]() |
![]() |