![]() |
![]() |

ఈ ఉదయం సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన ఆస్పత్రి పాలైన కొన్ని గంటలకే మరో హీరో అస్వస్థతకు గురి కావడం సంచలనంగా మారింది. తాజాగా యువ హీరో నాగ శౌర్య షూటింగ్‌లో సొమ్మసిల్లి పడిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
ఈ నెల 20న బెంగళూరుకి చెందిన అనూష శెట్టి అనే యువతితో నాగ శౌర్య పెళ్లి జరగనుంది. పెళ్లికి ఇంకా ఐదు రోజులే ఉండగా అనూహ్యంగా ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యాడు శౌర్య. ప్రస్తుతం శౌర్య హీరోగా తన 24వ సినిమాని వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ లో అరుణాచలం అనే దర్శకుడితో చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లోనే శౌర్య అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. షూటింగ్ లో సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయనను ఆస్పత్రికి తలరించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
'లక్ష్య' సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించి మెప్పించాడు శౌర్య. ఇప్పుడు కొత్త సినిమాలో కూడా సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడట. దానికోసం కొంతకాలంగా డైట్ ఫాలో అవుతూ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడట. సరిపడా ఫుడ్ తీసుకోకపోవడమే వల్లే ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.
![]() |
![]() |