![]() |
![]() |

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప: ది రైజ్'తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా రెండో భాగం 'పుష్ప: ది రూల్' షూటింగ్ ఇంతవరకు మొదలుకాలేదు. షూటింగ్ మరియు సినిమాకి సంబంధించిన ఇతర అంశాల గురించి ఎటువంటి అధికారిక అప్డేట్స్ లేవు. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. తాజాగా వారు నిరసనకు కూడా దిగారు.
'పుష్ప-2' అప్డేట్ ఇవ్వాలని కోరుతూ ఆదివారం సాయంత్రం బన్నీ ఫ్యాన్స్ అల్లు కుటుంబానికి చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. కాగా పుష్ప నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అయితే ఫ్యాన్స్ గీతా ఆఫీస్ ముందు ధర్నా చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇది జస్ట్ ట్రైలర్ అని, త్వరలోనే అప్డేట్ ఇవ్వకపోతే మైత్రి ఆఫీస్ ఎదుట భారీస్థాయిలో ధర్నా చేస్తామని అంటున్నారు.
ఇదిలా ఉంటే పుష్ప-2 గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సైలెంట్ గా షూటింగ్ మొదలైందని కొందరు.. టీజర్ కి సరిపడా కంటెంట్ ఇప్పటికే రెడీగా ఉందని, డిసెంబర్ 16న విడుదలవుతున్న 'అవతార్-2' థియేటర్స్ లో పుష్ప-2 టీజర్ ని ప్రదర్శిస్తారని అంటున్నారు. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
![]() |
![]() |