![]() |
![]() |

కొందరి పేర్లు గుర్తుకొస్తేనే, ఇదో ఫాస్ట్ ఫుడ్ లైఫ్ అన్నట్టే అనిపిస్తోంది. రీసెంట్‌గా పెళ్లి చేసుకుని అప్పుడే బిడ్డకు తల్లయ్యారు ఆలియా. ఆమె తర్వాత పెళ్లి చేసుకున్నా ఆమె కన్నా ముందే తల్లయ్యారు నయనతార. ఈ తారల ప్లానింగ్ చూసి అవాక్కవుతున్నారు సీనియర్ సెలబ్రిటీలు. ఈ నెల 18న నయనతార బర్త్ డే. లాస్ట్ బర్త్ డేకి, ఈ బర్త్ డేకి ఎంత చేంజ్ వచ్చేసింది అని అంటున్నారు నయన్ ఫ్యాన్స్. ఈ నెల 18న నయనతారకు 38 ఏళ్లు నిండుతాయి.
గత కొన్నేళ్లుగా నయనతార పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు ఆమె భర్త విఘ్నేష్ శివన్. ఈ ఏడాది బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం వారి పెళ్లయింది. ఈ పెళ్లయ్యాక వస్తున్న నయన్ తొలి పుట్టినరోజు ఇది. ఈ సారి ఆమెతో భర్తతో పాటు ఉయిర్, ఉలగం అంటూ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. తన ఇద్దరు కొడుకులతో, భర్తతో, నయన్ ఎలా పుట్టినరోజు వేడుకలు చేసుకోబోతున్నారని సర్వత్రా ఆసక్తి క్రియేట్ అయింది.
అయితే అత్యంత సన్నిహితుల మధ్య కేక్ కట్ చేయాలనుకుంటున్నారట నయనతార. తన భర్తతోనూ, ఇద్దరు పిల్లలతోనూ టైమ్ స్పెండ్ చేయాలన్నది ఆమె కోరికట. ఆమె ప్రస్తుతం 'జవాన్' లాస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. పుట్టినరోజు వేడుకలు పూర్తి కాగానే ఆ షూటింగ్‌కి వెళ్లాల్సి ఉంది. అందుకే దొరికిన కాసింత సమయాన్ని కూడా కుటుంబానికే కేటాయించాలని ఉందని విఘ్నేష్‌తో చెప్పారట. దానికి తగ్గట్టే ప్లాన్ చేస్తున్నారట విఘ్నేష్ శివన్. ఈ ఏడాది జూన్‌లో నయనతార, విఘ్నేష్ శివన్ మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. గత నెల 9న సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చారు ఈ జంట.
![]() |
![]() |