![]() |
![]() |

గతేడాది 'పుష్ప: ది రైజ్'తో దర్శకుడు సుకుమార్, ఈ ఏడాది 'ది కాశ్మీర్ ఫైల్స్'తో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సంచలన విజయాలను అందుకొని దేశవ్యాప్తంగా వారి గురించి, వారి సినిమాల గురించి మాట్లాడేలా చేశారు. ఎంతో ప్రతిభ ఉన్న దర్శకులుగా పేరు తెచ్చుకున్న వీరు ఇప్పుడొక ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ ని 'ది కాశ్మీర్ ఫైల్స్' నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు.
దర్శకులు సుకుమార్, వివేక్ అగ్నిహోత్రితో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తాజాగా అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. ఇద్దరూ జీనియస్ దర్శకులతో కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉందని అన్నారు. ఇండియన్ సినిమా స్వరూపాన్ని మార్చే ప్రాజెక్ట్ రూపొందనుందని, మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
సుకుమార్, వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ ల కలయిక ఆసక్తికరంగా మారింది. సుకుమార్, వివేక్ అగ్నిహోత్రి ఇద్దరిలో ఎవరు డైరెక్ట్ చేస్తారు? హీరో ఎవరు? అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
![]() |
![]() |