![]() |
![]() |

జయాపజయాలతో సంబంధం లేకుండా యువ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల 'కృష్ణ వ్రింద విహారి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శౌర్య చేతిలో ప్రస్తుతం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', 'నారి నారి నడుమ మురారి' వంటి సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు శౌర్య.
వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా నాగశౌర్య హీరోగా 24 సినిమా రూపొందనుంది. నూతన దర్శకుడు ఎస్.ఎస్.అరుణాచలం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని తాజాగా అధికారికంగా ప్రకటించారు. యాక్షన్ సినిమాలు శౌర్యకు ఎక్కువగా చేదు ఫలితాలనే మిగిల్చాయి. మరి ఈ సినిమా అయినా శౌర్యకు సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.

శ్రీనివాసరావు, విజయకుమార్, అశోక్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.
![]() |
![]() |