![]() |
![]() |

ఈ దసరాకు మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రంతో అలరించాడు. అక్టోబర్ 5న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కి రీమేక్ గా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ త్వరలో ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
విడుదలకు ముందే 'గాడ్ ఫాదర్' డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ లో విడుదలైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతోంది. నవంబర్ 19 నుంచి ఓటీటీలో 'గాడ్ ఫాదర్' అందుబాటులోకి రానుందని తాజాగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'గాడ్ ఫాదర్'.. ఓటీటీలో కూడా ఆ స్థాయి రెస్పాన్స్ తెచ్చుకుంటుందేమో చూడాలి.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
![]() |
![]() |