Home

»

Latest News

దెయ్యంగా మారిన కాజల్!

Oct 31, 2022 4:23PM

 

కాజల్ అగర్వాల్ నటిస్తోన్న లేటెస్ట్ తమిళ్ ఫిల్మ్ 'ఘోస్టీ'. హారర్ కామెడీగా రూపొందుతోన్న ఈ మూవీని కల్యాణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అక్టోబర్ 31న ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రకారం కాజల్ రెండు పాత్రల్లో కనిపించనున్నది. ఒకటి.. పోలీస్ ఇన్‌స్పెక్టర్ క్యారెక్టర్ కాగా, ఇంకొకటి.. సినీ హీరోయిన్ క్యారెక్టర్. ఇదివరకు ఈ సినిమా నేరుగా ఓటీటీలో రానున్నట్లు ప్రచారం జరిగింది. టీజర్‌తో ఆ ప్రచారానికి చెక్ పెట్టిన మేకర్స్.. 'ఘోస్టీ' థియేటర్లలో రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు.

కాజల్ ఇటీవలే కమల్ హాసన్ మూవీ 'ఇండియన్ 2' (భారతీయుడు 2) షూటింగ్‌ను మొదలుపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆమె ఒక బాబుని ప్రసవించింది. అతనికి నీల్ అనే పేరు పెట్టారు కాజల్, గౌతం దంపతులు.

సోమవారం తన ఇన్‌స్టాగ్రాం స్టోరీస్ ద్వారా 'ఘోస్టీ' టీజర్‌ను షేర్ చేసిన కాజల్, "Here we go. A full on entertainment mode teaser of #Ghosty starring #YogiBabu and me! Perfect for Haloween, isn't it?! :) From the director of Gulebaghavali and Jackpot #Kalyaan! (sic)." అని రాసుకొచ్చింది.

టీజర్‌లో చూపించిన దాని ప్రకారం హీరోయిన్ చనిపోయి దెయ్యంగా మారి, ఇన్‌స్పెక్టర్ క్యారెక్టర్‌ను సతాయిస్తుందని తెలుస్తోంది. ఒక్క యోగిబాబు మాత్రమే ఆ ఆత్మను చూడగలుగుతాడని కూడా అర్థమవుతోంది.

'ఘోస్టీ' మూవీలో కాజల్ అగర్వాల్, యోగిబాబు, కె.ఎస్. రవికుమార్, ఊర్వశి, రాధిక, రెడిన్ కింగ్‌స్లే, ఆడుకాలం నరైన్ కీలక పాత్రధారులు, సాం సీఎస్ మ్యూజిక్ అందిస్తుండగా, జాకబ్ రత్నరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com