Home

»

Latest News

'ధ‌మాకా' రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

Oct 25, 2022 12:31PM

 

మాస్ మహారాజా రవితేజ హీరోగా ద‌ర్శ‌కుడు త్రినాథరావు నక్కిన రూపొందిస్తోన్న‌ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన యంగ్ యాక్ట్రెస్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టి.జి. విశ్వ ప్రసాద్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై త‌యార‌వుతున్న‌ ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. 

దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ధమాకా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్.. ధ‌మాకాపై అంచనాలు పెంచాయి. టీజర్ అయితే సినిమా ట్యాగ్ లైన్ కి తగ్గట్టు ‘డబుల్ ఇంపాక్ట్’ క్రియేట్ చేసింది.   

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా, భీమ్స్ సిసిరోలియో సంగీత ద‌ర్శ‌కుడిగా, రామ్‌-ల‌క్ష్మ‌ణ్ ఫైట్ మాస్ట‌ర్లుగా ప‌నిచేశారు.

ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ లాంటి వ‌రుస‌గా ఒక దాన్ని మించిన మ‌రో ఫ్లాప్ చ‌విచూసిన ర‌వితేజ‌కు ఈ మూవీ ధ‌మాకా హిట్‌ను అందిస్తుంద‌ని సినిమా యూనిట్ గ‌ట్టి న‌మ్మ‌కం వ్య‌క్తం చేస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com