Home  »  News  »  ఆ హీరో షూటింగ్ టైంలో గుచ్చిగుచ్చి నన్ను హర్ట్ చేసేవాడు!

Updated : Oct 25, 2022

కండల ఆంటీ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు వెండితెర‌పై, ఇటు బుల్లి తెరపై (షోస్‌లో) కనిపిస్తూ అలరిస్తూనే ఉంది. అంతేకాదు, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. తన లైఫ్ లో జరిగిన ఎన్నో ఇన్సిడెంట్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ప్ర‌గ‌తి. "డిగ్రీ 1st ఇయర్ చదివేటప్పుడే నాకు భాగ్యరాజా గారి సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. తెలుగులో అది 'గౌరమ్మా నీ మొగుడెవరమ్మా' అనే పేరుతో వచ్చింది. అందులో హీరోయిన్ గా చేసాను." అని ఆమె చెప్పింది.

ఆమెకు తెలిసిన ఒకామె ఆమెను భాగ్యరాజాకు ఇంట్రడ్యూస్ చేశారు. "మేము ఉండే అపార్ట్మెంట్ లో మా పైన పోర్షన్ లో సి.ఆర్. సరస్వతి అనే ఆంటీ తన పోర్షన్ ని అప్పట్లో రెంట్ కి ఇచ్చారు. అలా రెంట్ తీసుకోవడానికి ఆవిడ‌ ప్రతీ నెలా వచ్చేవారు. అలాంటి టైంలో 'రోజా' మూవీ రిలీజ్ అయ్యింది. ఇక అప్పుడు నేను చుట్టుపక్కల ఉండే  అమ్మాయిల్ని పోగేసి మాట్లాడుతూ ఉండేదాన్ని. ఆ టైములో ఆవిడ వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు నన్ను మధుబాల, మధుబాల అని పిలిచేవారు. ఇక అంత మంది ముందు మధుబాల అనేసరికి ఒక ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ తో పోల్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది." అని ఆమె గుర్తు చేసుకుంది.

"అలా మా అమ్మ చేసిన వంట తినడానికి మా ఇంటికి రావడం, అదే టైంలో నేను చేసిన యాడ్ ఫొటోస్ ఆవిడ చూడడం జరిగింది. అలా మూవీస్ లోకి ఎంట్రీ వచ్చింది. ఐతే ఒకానొక టైంలో సినిమాలు చేయకూడదు అని ఎందుకు అనిపించింది అంటే.. ఈ ఫీల్డ్ లో రెస్పెక్ట్ అనేది ఉండదు. ఒక హీరో కమ్‌ ప్రొడ్యూసర్ తో కలిసి ఒక వాన పాట చేయాల్సి వచ్చింది. అక్కడ అతనితో కాస్ట్యూమ్స్ విషయంలో పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యింది. 'నాకు కంఫర్ట్ గా లేకపోతే నేను చేయను' అని చెప్పి షూటింగ్ స్పాట్ నుంచి వచ్చేసాను. అందరూ వచ్చి నచ్చ చెప్పారు కానీ నేను మాత్రం నా మాట మీదే నిలబడ్డాను. 'ఇతని ప్లేస్ లో కమల్ హాసన్, రజనీకాంత్ ఉంటే చేస్తాను కానీ ఇతనితో చేయను.. నా బాలన్స్ పేమెంట్ ఇచ్చేయండి.. ఏదోలా ఈ సాంగ్ షూటింగ్ ఐపోయాక ఇంక చేయను' అని చెప్పేసాను. అదంతా మనసులో పెట్టేసుకుని అతను షూటింగ్ టైంలో గుచ్చిగుచ్చి నన్ను హర్ట్ చేసేవాడు. దాంతో మూవీస్ చేయకూడదని నిర్ణయించుకున్నా" అని వివ‌రంగా వెల్ల‌డించింది ప్రగతి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.