![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను తీసుకొని యస్.యస్. రాజమౌళి ఇటీవల జపాన్‌కు వెళ్లారు. అక్కడ జపనీస్ లాంగ్వేజ్‌లో 'ఆర్ఆర్ఆర్' మూవీ విడుదలవడమే దీనికి కారణం. మూడు రోజులుగా ఆ సినిమా ప్రమోషన్స్‌లో వారంతా బిజీగా గడిపారు. అయితే వారు సింగిల్‌గా వెళ్లలేదనీ, కుటుంబ సమేతంగా వెళ్లారనీ తాజాగా వెల్లడైంది. ప్రమోషన్స్ మధ్యలో తీరిక లభించగా చరణ్, తారక్ ఇద్దరూ తమ భార్యలతో జపాన్ రాజధాని టోక్యో రోడ్లపై కలిసికట్టుగా చేయీ చేయీ కలిపి సరదాగా నడిచారు. చరణ్-ఉపాసన, తారక్-లక్ష్మీప్రణతితో పాటు రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా తన భార్యతో ఆ వాక్‌లో పాల్గొన్నాడు.
కొద్ది దూరం నవ్వుతూ, తుళ్లుతూ నడిచిన తర్వాత తారక్ ఆగిపోయాడు. దాంతో మిగతా వాళ్లు కూడా ఆ జోవియల్ వాక్‌ను ఆపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. దానికి "Together forever ❤️!! #rrr " అనే క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
'బాహుబలి' ఫ్రాంచైజీతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్'తో ఆయన ప్రపంచంలోని అగ్ర సినీ విమర్శకుల, విశ్లేషకుల దృష్టిలో పడ్డారు. అదే ఆ సినిమాకు ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియలో స్థానం లభించేట్లు చేసింది. ఇప్పుడు ఆ సినిమా జపనీస్ భాషలో విడుదలైంది. "నాటు నాటు" సాంగ్ జపాన్‌లో సూపర్ పాపులర్ అవడం ఇంకో విశేషం.
![]() |
![]() |