![]() |
![]() |

కొద్ది రోజులుగా రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా కన్నడ చిత్రం 'కాంతార'. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రం.. అక్టోబర్ 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడా భారీ వసూళ్ళతో దూసుకుపోతుంది. 'కాంతార'తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన రిషబ్ శెట్టి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.
తెలుగులో 'కాంతార'ను అల్లు అరవింద్ విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.15 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ తో కలిసి అల్లు అరవింద్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాకి భాషా భేదం లేదని మరోసారి రుజువైందని అన్నారు. ఇది విదేశీ సినిమాలు చూసి స్ఫూర్తి పొందిన సినిమా కాదని, మన మట్టిలో నుంచి పుట్టిన కథ అని, అందుకే అందరికీ ఇంతలా నచ్చుతుందని అభిప్రాయపడ్డారు.
అలాగే రిషబ్ శెట్టిని గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయమని అడగగా, అతను అంగీకరించాడని అల్లు అరవింద్ తెలిపారు. తమ కలయికలో త్వరలో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు.
![]() |
![]() |