Home

»

Latest News

కొండారెడ్డి బురుజు దగ్గర బాలయ్య సింహ గర్జన!

Oct 19, 2022 3:40PM

నటసింహం నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 107'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 21న ఈ మూవీ టైటిల్ ని ప్రకటించబోతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'NBK 107' టైటిల్ ని ఈ శుక్రవారం రివీల్ చేయబోతున్నారు. కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు దగ్గర ఈ టైటిల్ లోగో లాంచ్ కార్యక్రమం జరగనుంది. ఈ చిత్రానికి 'రెడ్డి గారు', 'వీర సింహా రెడ్డి' అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఎక్కువగా 'రెడ్డి గారు' పేరు బలంగా వినిపించింది. కానీ మూవీ టీమ్ 'వీర సింహా రెడ్డి' టైటిల్ కే ఓటేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 8:15 కి ఈ చిత్ర టైటిల్ ఏంటో అధికారికంగా తెలియనుంది. 

ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com