![]() |
![]() |

'గంగోత్రి'(2003) సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. తనదైన నటన, స్టైల్, డ్యాన్స్ లతో స్టార్ గా ఎదిగాడు. గతేడాది వచ్చిన 'పుష్ప: ది రైజ్'తో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బన్నీ ఈ స్థాయికి వస్తాడని ఎంతమంది ఊహించారో తెలీదు కానీ.. చిన్న వయసులో బన్నీని చూసి ఆయన తాతగారు అల్లు రామలింగయ్య మాత్రం అసలు ఇతను ఎందుకూ పనికిరాడని భావించారట. ఈ విషయాన్ని స్వయంగా బన్నీనే పంచుకున్నాడు.
అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్ లో 'అల్లు రామలింగయ్య' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో మెగా, అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. "నాకు 16 ఏళ్ళు వచ్చేవరకు తాతయ్య, నానమ్మలతోనే ఉన్నాను. తాతయ్య చనిపోయాక నాకు పది లక్షల ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది. నేను నాలుగో తరగతి చదువుతున్న సమయంలో వీడు జీవితంలో ఎందుకూ పనికిరాడని భావించిన ఆయన.. నాకు భవిష్యత్ లో ఉపయోగపడతాయని ఆ డబ్బు జమ చేశారు. ఆయన దృష్టిలో ఎందుకూ పనికి రాని నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటం ఆనందంగా ఉంది. ఆయన నా ఎదుగుదలను చూసి ఉంటే బాగుండేది" అన్నాడు.
![]() |
![]() |