Home  »  News  »  అందుకే 'బ్రహ్మాస్త్ర' ఆఫర్ వదులుకున్నా!

Updated : Sep 15, 2022

సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. బెంచ్‌మార్క్ స్టూడియోస్‌ పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. గాజులపల్లె సుధీర్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రేపు(సెప్టెంబర్ 16న) ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో హీరో సుధీర్ బాబు తాజాగా మీడియాతో ముచ్చటించారు.

 

దర్శకుడు ఇంద్రగంటితో ఇది మీకు మూడో చిత్రం. మీ కాంబినేషన్, ఆయనతో మీ ప్రయాణం గురించి చెప్పండి?
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ లో ఒక ఒక డైలాగ్ వుంది. ''మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం. కానీ సినిమానే మనల్ని తీస్తుంది" అని. వాస్తవానికి మా కాంబినేషన్ వలన ఈ సినిమా జరగలేదు. సినిమానే మమ్మల్ని ఎంపిక చేసుకుంది. ఆయన నన్ను యాక్టర్ గా నమ్మారు. నేను ఆయన కథల్ని నమ్మాను. ఆయన ఒక కాంబినేషన్ ని సెట్ చేసుకోవాలనుకునే దర్శకుడు కాదు. సాధారణంగా ఒక హిట్ ఇచ్చిన వెంటనే ఒక పెద్ద స్టార్ కోసం ఎదురుచూస్తారు. కథలు రాస్తారు. కానీ ఆయన మాత్రం ఒక కథని రాసుకొన్న తర్వాత దానికి ఎవరు నప్పుతారో చూస్తారు. ఆయన నాతో సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

 

సమ్మోహనంలో సినిమా నేపథ్యం వుంటుంది కదా... ఇందులో కూడా సినిమా నేపథ్యం. రెండిటికి ఏమైనా పోలికలు ఉన్నాయా?
లేదండీ. సినిమా నేపథ్యం అనే మాటే కానీ రెండు సినిమాలకి ఎలాంటి పోలిక లేదు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చాలా ఫ్రెష్ గా వుంటుంది. 'సమ్మోహనం'లో సంఘర్షణ అమ్మాయి అబ్బాయి మధ్యనే వుంటుంది. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' లో కుటుంబాల మధ్య సంఘర్షణ వుంటుంది. చాలా డిఫరెంట్ గా వుంటుంది. చూస్తే మీకే అర్ధమైపోతుంది.

 

ట్రైలర్ లో మీ పాత్ర ఎమోషనల్ గా కనిపించింది కదా.. సినిమాలో ఎలా ఉండబోతుంది?
ఇంద్రగంటి గారి సినిమాల్లో ఎమోషన్ చాలా గొప్పగా వుంటుంది. ప్రతి ఒక్కరూ ఆ పాత్రలతో ప్రయాణిస్తారు. ఇందులో కమర్షియల్ సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపిస్తా. ఆ పాత్రకి కొంచెం తిక్క, భిన్నమైన అభిరుచి వుంటుంది. కమర్షియల్ సినిమా కూడా గొప్ప పర్పస్ కోసం తీస్తామని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇంద్రగంటి గారు ఈ పాత్రని చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారు.

 

వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి చెప్పండి?
ఇంద్రగంటి- వివేక్ సాగర్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ వుంది. ఇంద్రగంటి గారి సినిమాల్లో ఇంట్రో సాంగ్, ఐటెం సాంగ్ సాధారణంగా వుండవు. అయితే ఈ కథలో నా పాత్ర కమర్షియల్ డైరెక్టర్ అవ్వడం వలన ఆ అవకాశం వచ్చింది. ఐటెం సాంగ్ చేయడం వివేక్ సాగర్ కి కూడా కొత్త. వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలు, నేపధ్య సంగీతం అన్నీ అద్భుతంగా వుంటాయి.

 

ఇంద్రగంటి సినిమాల్లో హీరోయిన్ కి ప్రాధన్యత వుంటుంది. ఇందులో కృతిశెట్టి పాత్ర ఎలా వుండబోతుంది?
ఉప్పెనకి ముందే కృతిశెట్టిని ఎంపిక చేశాం. చాలా మంచి నటి. ఒక పాత్రని అర్ధం చేసుకోవడం చాలా పరిణితి కనబరుస్తుంటుంది. ఉప్పెనతో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాతో ఏ పాత్రైనా చేయగలననే నమ్మకం కలిగిస్తుందని భావిస్తున్నా. శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా వుంటాయి.

 

ఇంద్రగంటి కథలు చాలా రిఫ్రెషింగా వుంటాయి కదా ఇందులో ఎలా వుంటుంది?
కథ పరంగా చాలా ఎమోషనల్ గా వుంటుంది. ఆయన ఇంత ఎమోషనల్ టచ్ చేసిన సినిమాలు లేవు. ఇంద్రగంటి ప్రజంటింగ్ స్టయిల్ వుంటుంది. ఎక్కువ సినిమా స్వేఛ్చ తీసుకోకుండా, ఫెర్ఫార్మెన్స్ చాలా రియల్ గా వుంటాయి. డైలాగ్స్ నేచురల్ గా వుంటాయి. పాత్రలు మనచుట్టూ ఉన్నట్లే వుంటాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూనే ఎమోషనల్ గా ఒక డిఫరెంట్ కథ, ప్రయాణం చాలా అద్భుతంగా వుంటాయి.

 

నిజ జీవితంలో దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా?
నేను చాలా మంది కొత్త దర్శకులతో పని చేశా. నాకు తెలియకుండానే దర్శకులు చేసే కొన్ని పనులు చేశాను. తప్పని పరిస్థితులు ఏవో సీన్స్, డైలాగ్స్ రాయడం, షూటింగ్ చూసుకోవడం వంటి పనులు చేయడంతో అనుకోకుండానే దర్శకత్వం వైపు ఒక ఆసక్తి ఏర్పడింది. అయితే దర్శకత్వం ఎప్పుడు చేస్తానో తెలీదు. ఇప్పటికైతే నా ద్రుష్టి నటనపైనే వుంది.

 

నిర్మాతలు మహేంద్రబాబు, కిరణ్ గురించి?
వారికి ఇండస్ట్రీలో అనుభవం వుంది. సినిమా పరిశ్రమ, ఇక్కడ బిజినెస్ గురించి తెలిసనవాళ్ళు. ఎక్కడా రాజీపడకుండా ఒక క్యాలిటీ సినిమాని తీశారు. వారికీ బ్యానర్ కి ఇది గుర్తిండిపోయే సినిమా అవుతుంది.

 

ట్రైలర్ లో విజువల్స్ చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి కదా.. డీవోపీ పీజీ విందా గురించి?
'సమ్మోహనం' సినిమాకి కలసి పని చేశాం. ఆ సినిమా కంటే మరో మెట్టులో వుంటుంది. చాలా విజువల్ బ్యూటీ వుంటుంది.

 

ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య మీకు' ఆల్ రౌండర్' అని కితాబిచ్చారు కదా?
నాగచైతన్య నా ఫస్ట్ హీరో. చాలా పాజిటివ్ పర్శన్. చైతో మాట్లాడుతున్నపుడు చాలా పాజిటివ్ వైబ్ వుంటుంది. చైతు నుండి ఆ మాట రావడం చాలా ఆనందంగా వుంది.

 

ఒక నటుడిగా మీ ఎదుగుదల ఎలా అనిపిస్తుంటుంది?
నటుడిగా తృప్తిగా వున్నాను. మంచి పాత్రలు ఎంచుకోవడం, అవి ప్రేక్షకులకు నచ్చడం ఆనందంగా వుంది.

 

బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయా?
వస్తున్నాయి. బ్రహ్మాస్త్ర వచ్చింది. కానీ ఆ సమయంలో సమ్మోహనం చేస్తున్నా. అలాగే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చర్చల్లో వుండటం వలన చేయడం కుదరలేదు.

 

కొత్తగా చేయబోతున్న చిత్రాలు?
హంట్, మామామశ్చీంద్ర, యూవీ క్రియేషన్స్ సినిమా, అలాగే సెహరి దర్శకుడు జ్ఞానసాగర్ తో ఓ సినిమా చేస్తున్నా. మామామశ్చీంద్ర ఇంకో ఇరవై రోజులు షూట్ వుంది. హంట్ సినిమాకి మార్వెల్ సిరిస్ కి చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పని చేశారు.

 

ఎప్పుడూ సిక్స్ ప్యాక్ తో వుండటం ఎలా సాధ్యపడుతుంది?
చాలా మంది ఇదే విషయాన్ని అడుగుతుంటారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని లాంచ్ చేస్తున్నా.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.