![]() |
![]() |

స్టార్స్ పండగల సమయంలో పూజల్లో పాల్గొనడం సహజం. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా గణేష్ నిమజ్జన వేడుకల్లో సందడి చేశాడు. ఆయన తన కూతురు అల్లు అర్హతో కలిసి నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రతి సంవత్సరం, అల్లు అర్జున్ తన కార్యాలయంలో వినాయకుని ప్రతిష్టించి పూజలు జరుపుతారు. ఈ సంవత్సరం కూడా గణేశుని ప్రతిమను ప్రతిష్టించి తన సిబ్బందితో కలిసి ఘనంగా పండుగ జరుపుకున్నాడు. అంతేకాదు తాజాగా జరిగిన గణేష్ నిమజ్జనం వేడుకలో తన కూతురితో కలిసి పాల్గొని సిబ్బందిలో ఉత్సాహం నింపాడు. రోడ్డుపైకి వచ్చి స్వామికి వీడ్కోలు పలుకుతూ వాహనం ముందు కొబ్బరికాయ కొట్టాడు. ఈ ఫోటోలను, వీడియోను ఆయన స్టాఫ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
![]() |
![]() |