![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్. ఈరోజు(సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'పవర్ గ్లాన్స్' పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన 'పవర్ గ్లాన్స్' ఈ చిత్రంపై అంచనాలను ఎన్నో రేట్లు పెంచేలా ఉంది. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్ లో ఉంది. మీసం తిప్పి, కదన రంగంలో అడుగుపెట్టి, మల్ల యోధులను మట్టి కరిపిస్తూ పవర్ ఫుల్ గా దర్శనమిచ్చారు పవర్ స్టార్. ఇక ఆయన తొడగొట్టే షాట్ అయితే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. "మెడల్ని వంచి, కథల్ని మార్చి, కొలిక్కితెచ్చే పనెట్టుకొని తొడకొట్టాడో.. తెలుగోడు" అంటూ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఎప్పటిలాగే అదరగొట్టారు ఎం.ఎం.కీరవాణి.

మొత్తానికి అభిమానులు తమ హీరో పుట్టినరోజును జరుపుకుంటున్న సమయంలో విడుదలైన ఈ పవర్ గ్లాన్స్ వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఉంది. మరి ఈ పవర్ గ్లాన్స్ కి తగ్గట్లే సినిమా కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందేమో చూడాలి.
![]() |
![]() |