![]() |
![]() |
.webp)
`లైగర్` మూవీ డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఫేమస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూరీ జగన్నాథ్‌కి అభిమానిని ఐనా 'లైగర్' పరాజయంపై ఎక్కువగా మాట్లాడనని, `లైగర్` ట్రైలర్ చూసినప్పుడే నచ్చలేదన్నారు. హీరో ఎలా ఉండాలి, చేసిన సినిమా గురించి ఆడియన్స్ దగ్గర ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి అనే విషయాలను ఆయన చెప్పారు.
"మంచి కంటెంట్ తో వచ్చిన మా సినిమాను చూడండి.. అని ఆడియన్స్ కి చెప్పాలి కానీ చిటికేసి 'దేశాన్ని తగలేస్తాం, ఊరును తగేలేస్తాం' అని కాదు.. 'మంచి సినిమా తీసాం, చూడండి, ఆదరించండి' అని పద్ధతిగా ఆడియన్స్ కి చెప్పాలి కానీ 'నేను తినకుండా షూటింగ్ చేసాను.. నేను అంత చేశాను, ఇంత చేసాను' అంటూ ఎగిరెగిరి పడితే జవాబు ఇలాగే ఉంటుంది" అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
"షూటింగ్ నువ్వెలా చేసావో ఆడియన్స్ కి అవసరం లేదు కదా" అని భరద్వాజ్ అన్నారు. బాయ్‌కాట్ ట్రెండ్‌పై మాట్లాడుతూ, అలా ట్రెండ్ చేసేవాళ్లలో చాలా మంది సినిమాలు అసలు చూడనివారే కాబట్టి అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాకి ఆదరణ పెరిగేకొద్దీ ఇలాంటి ట్రెండ్స్ ఎక్కువవుతున్నాయన్నారు. అదే కంటెంట్ బాగుంటే బాయ్ కాట్ చేయరు కదా ఆడియన్స్ అని చెప్పారు.
"సినిమాకు చెడ్డ రోజులనేవి లేవు, అన్ని మంచి రోజులే. జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్లడమే. ఇండస్ట్రీలో సక్సెస్ కేవలం 5 శాతమే. 95 శాతం సినిమాలు ఆడవు. అప్పుడు బాడ్ డేస్ అనుకుంటే అంతే. ఐనా ఇప్పుడు చూసుకుంటే ఈ రెండు మూడు నెలల్లోనే ఎన్నో మూవీస్ రిలీజ్ అయ్యాయి, హిట్స్ కొట్టాయి కదా. ఇండస్ట్రీలో హడావిడి చేస్తే కుదరదు. అలాగే సోషల్ మీడియాలో లైకుల కోసం ఆరాటపడడం మానేస్తే చాలు.. చాలా వరకు సక్సెస్ ఐనట్టే. కంటెంట్ ఉంటే చాలు, ఆడియెన్స్ ని ఎవరూ ఆపలేరు" అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్.
![]() |
![]() |