![]() |
![]() |
.webp)
చిరంజీవి, రవితేజ కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలుసు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తోన్న ఆ సినిమాకు 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ కొంతకాలంగా ప్రచారంలో ఉంది కానీ ఇంతదాకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ మూవీలో చిరంజీవి సరసన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. కాగా ఈ సినిమా గతంలో మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఓ బ్లాక్‌బస్టర్ మూవీ స్టోరీ లైన్‌తో రూపొందుతోందనే విషయం ప్రచారంలోకి వచ్చింది. ఆ సినిమా.. ఘర్షణ (1988). ప్రభు, కార్తీక్ సవతి అన్నదమ్ములుగా ఆ మూవీలో నటించారు. ఇద్దరికీ తల్లులు వేరే కానీ, తండ్రి ఒక్కరే.
ఇప్పుడు అదే తరహాలో 'వాల్తేరు వీరయ్య'లో సవతి సోదరులుగా చిరంజీవి, రవితేజ నటిస్తున్నట్లు ఓ పోర్టల్ రాసుకొచ్చింది. ఇద్దరికీ తండ్రి ఒక్కరే కానీ తల్లులు వేరు అంట. ఘర్షణలో ప్రభు, కార్తీక్‌కు ఒకరంటే ఒకరికి గిట్టదు. ఎదురుపడినప్పుడల్లా పరస్పరం ఘర్షణ పడుతుంటారు. కొట్టుకుంటూ ఉంటారు. మరి 'వాల్తేరు వీరయ్య'లోనూ చిరు, రవితేజ అలాగే ఘర్షణ పడుతుంటారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
2000లో వచ్చిన 'అన్నయ్య' సినిమాలో అన్నదమ్ములుగా ఆ ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వారు బ్రదర్స్‌గా తెరమీద కనిపించబోతున్నారు. ఒకవేళ నిజంగానే 'ఘర్షణ' తరహా కథతో వాల్తేరు వీరయ్య రూపొందుతున్నట్లయితే, చిరు-రవితేజ మధ్య వచ్చే సీన్లు ఆడియెన్స్‌ను అలరించడం ఖాయం.
![]() |
![]() |