![]() |
![]() |

దర్శకుడు శివతో కలిసి పనిచేయడానికి రెడీ అయ్యాడు తమిళ స్టార్ యాక్టర్ సూర్య. ఇటీవల చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. కాగా, ఈ సూర్య42 మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు చెన్నైలో మొదలైంది. ఓ 10 రోజుల పాటు అక్కడ ఓ షెడ్యూల్ నిర్వహించి, ఆ తర్వాత గోవాలో చిత్రీకరణ జరపనున్నారు.
స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ పతాకాలపై జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీత దర్శకునిగా, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. బాలీవుడ్ భామ దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంలో ఆమెకిదే తొలి చిత్రం. తెలుగులో ఆమె వరుణ్ తేజ్ జోడీగా 'లోఫర్'లో నటించింది.
ఇదివరకు ఈ యాక్షన్ డ్రామాలో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. చివరకు దర్శక నిర్మాతలు నాయికగా దిశా పటానిని ఎంపిక చేశారు. అధికారికంగా ఆమె పేరును ప్రకటించడమే తరువాయి.
![]() |
![]() |