![]() |
![]() |

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కొంతకాలంగా యువ దర్శకులతో విభిన్న చిత్రాలు చేస్తూ అలరిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'పిఎస్‌వి గరుడ వేగ', ప్రశాంత్ వర్మతో 'కల్కి' సినిమాలు చేసి అలరించిన రాజశేఖర్.. ఇప్పుడు పవన్ సాధినేనితో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.
'ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి' వంటి సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పవన్.. 'సేనాపతి' నుంచి రూట్ మార్చాడు. ఇప్పుడు రాజశేఖర్ తో కలిసి కంప్లీట్ యాక్షన్ లోకి దిగబోతున్నాడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియాపై మల్కాపురం శివ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మాన్ స్టర్' అనే టైటిల్ పెట్టారు.

ఈరోజు(మంగళవారం) పూజా కార్యక్రమాలతో 'మాన్ స్టర్' మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. మూవీ టీమ్ తో పాటు జీవిత రాజశేఖర్, ప్రవీణ్ సత్తారు, ప్రశాంత్ వర్మ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కాలెపు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు.
![]() |
![]() |