![]() |
![]() |

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే దురదృష్టవశాత్తు ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఒక అభిమాని మృతి చెందాడు.

పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలానికి చెందిన పుట్టా సాయి రామ్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడట. నిన్న తన స్నేహితులతో కలిసి 'బింబిసార' ఈవెంట్ కి హాజరు కాగా, అనారోగ్య కారణాల దృష్ట్యా అతను ఆ కార్యక్రమంలో అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆరోగ్యం విషమించడంతో ఆ అభిమాని మృతి చెందినట్లు సమాచారం. సాయి రామ్ మృతికి 'బింబిసార' మూవీ టీమ్ సంతాపం వ్యక్తం చేసింది. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపింది.
![]() |
![]() |