![]() |
![]() |

మాస్ మహారాజ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ యాక్షన్ థ్రిల్లర్ జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే నిజానికి 'రామారావు ఆన్ డ్యూటీ' కథని రవితేజను దృష్టిలో పెట్టుకొని రాయలేదట. మొదట ఈ కథ నాగార్జున దగ్గరకు వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ శరత్ మండవ చెప్పడం విశేషం.
తాజాగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'రామారావు ఆన్ డ్యూటీ' గురించి డైరెక్టర్ శరత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇది కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ అని తెలిపారు. ఈ కథ రాసుకునేటప్పుడు ఫలానా హీరోని ఊహించుకొని రాయలేదని, కానీ ఇది పెద్ద హీరో చేస్తేనే బాగుంటుందని అనుకున్నానని చెప్పారు. మొదట ఈ కథను నాగార్జునకు చెప్పగా, ఆయనకు నచ్చిందని.. కానీ అప్పటికే ఆయన మూడు సినిమాలు('వైల్డ్ డాగ్', 'బంగార్రాజు', 'ది ఘోస్ట్') కమిట్ అయ్యి ఉండటంతో డేట్స్ ఖాళీ లేవని అన్నారు. ఆ తర్వాత రవితేజకు చెప్పగా ఓకే చెప్పారని తెలిపారు. కథలో ఎలాంటి మార్పులు చేయలేదని, రవితేజ బాడీ ల్యాంగ్వేజ్ కి తగ్గట్లు డైలాగ్స్ రాసుకోవడం జరిగిందని శరత్ చెప్పుకొచ్చారు.
![]() |
![]() |