![]() |
![]() |

సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు నేడు(జులై 25). ఈ సందర్భంగా కైకాలను కలిసిన మెగాస్టార్ చిరంజీవి ఆయన చేత కేక్ కట్ చేయించి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
కైకాలతో చిరంజీవికి మంచి అనుబంధముంది. 87 ఏళ్ళ కైకాల ఆరోగ్యం చిరంజీవి తరచూ ఆరా తీస్తుంటారు. వీలు చూసుకొని వెళ్లి ఆయనను కలుస్తుంటారు. ఇక ఈరోజు కైకాల పుట్టిన రోజు కావడంతో.. చిరంజీవి ఆయన చేత కేక్ కట్ చేయించి, కాసేపు ముచ్చటించి ఆయనను సంతోష పరిచారు. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు చిరంజీవి. "పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున, వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను" అంటూ చిరంజీవి రాసుకొచ్చారు.
.webp)
అయితే చిరంజీవి షేర్ చేసిన ఫొటోల్లో కైకాల బెడ్ పైనే ఉన్నారు. ఆయన పక్కన ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంది. దీంతో నెటిజన్లు ఓ వైపు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే, మరోవైపు ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.

![]() |
![]() |