![]() |
![]() |

ఎంత సెలబ్రిటీ అయినా తను కూడా ఒక బిడ్డకు తల్లే కదా. అందుకే కాసేపు తన బిడ్డ పక్కన లేకపోతేనే తల్లడిల్లిపోతోంది. తాజాగా తన ముద్దుల కూతురు విద్యా నిర్వాణను స్కూల్ కి పంపించి, తనను మిస్ అవుతున్నానంటూ కన్నీరు పెట్టుకుంది మంచు లక్ష్మి.
లాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో స్కూల్ పిల్లలు రెండేళ్లు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో 24 గంటలూ పిల్లల అల్లరి ఎలా భరించాలంటూ అందరి పేరెంట్స్ లాగే మంచు లక్ష్మి కూడా మొదట్లో అనుకుందట. అయితే ఎప్పుడూ ఇంట్లోనే ఉండటంతో తల్లీకూతుళ్ళ మధ్య ప్రేమానుబంధం మరింత పెరిగిందట. కూతుర్ని వదిలి మంచు లక్ష్మి కాసేపు కూడా ఉండలేకపోతోందట. స్కూల్స్ రీఓపెన్ అవ్వడంతో విద్యాను స్కూల్ కి పంపిన మంచు లక్ష్మి.. తాజాగా తన బాధను సోషల్ మీడియాలో పంచుకుంది. విద్యాకు దూరంగా ఉండటం ఇంత కష్టంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. త్వరలోనే దీనికి అలవాటుపడతాను అనుకుంటున్నాను అంటూ ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.
![]() |
![]() |