![]() |
![]() |

నితిన్ హీరోగా రూపొందిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదల కానున్నది. కృతి శెట్టి నాయికగా నటించిన ఈ మూవీ ద్వారా ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నాడు. మహతి స్వరసాగర్ సంగీతం అందించగా ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సంగీత ప్రియులను అలరించాయి. శనివారం మూడో పాట 'అదిరిందే'ను రిలీజ్ చేశారు.
ఫ్యూజన్ వెస్ట్రన్ టచ్‌తో పెప్పీగా మహతి స్వరసాగర్ బాణీలు కూర్చిన ఈ పాటను కృష్ణకాంత్ రాశారు. "అదిరిందే పసిగుండె తగిలిందే హైవోల్టే" అంటూ మొదలైన ఈ పాటలో "మగజాతికి హానివె నువ్వు.. నా పక్కన రాణివి నువ్వు.. ఒక చాన్సివ్వు.." అంటూ నితిన్ బతిమలాడటం కనిపిస్తుంది. ఈ పాటంతా కృతి అందాన్ని హైలైట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎక్కువ క్లిష్టమైన మూవ్‌మెంట్స్ కాకుండా సింపుల్ బట్ స్టయిలిష్ స్టెప్స్‌తో నితిన్ ఆకట్టుకున్నాడు. తన అందచందాలతో ఇప్పటికే యువతకు కలల రాణిగా మారిన కృతి ఈ పాటలో మరింత అందంగా ఉంది.
కేథరిన్ ట్రెసా మరో నాయికగా నటించిన ఈ మూవీలో "రారా రెడ్డి" అనే స్పెషల్ సాంగ్‌లో అంజలి నర్తించింది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ రాశారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేశారు.
![]() |
![]() |