![]() |
![]() |

స్టార్ యాక్టర్, యాక్షన్ కింగ్‌గా పేరుపొందిన అర్జున్ మాతృమూర్తి లక్ష్మీదేవి శనివారం కన్నుమూశారు. బెంగళూరులోని జయానగర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. శక్తిప్రసాద్ భార్య, కన్నడ హీరో ధ్రువ సర్జా అమ్మమ్మఅయిన లక్ష్మీదేవి వయసు 85 సంవత్సరాలు.
అర్జున్ సర్జా కొన్ని నెలల క్రితం తన మామగారిని కోల్పోయిన సంగతి తెలిసిందే. కన్నడిగులకు ఇష్టమైన కళాతపస్వి రాజేష్ ఫిబ్రవరిలో మరణించారు. ఆ తర్వాత అర్జున్ ఇంట ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీదేవమ్మ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమె పార్ధివ దేహాన్ని అపోలో ఆస్పత్రి నుంచి అర్జున్ నివాసానికి తరలించారు. మైసూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
![]() |
![]() |