![]() |
![]() |

తమిళ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను నార్మల్ వార్డ్‌కు తరలించారు. ఈ రోజు సాయంత్రానికల్లా ఆయన డిశ్చార్జ్ అవుతారని ఆశిస్తున్నారు. ఈరోజు చెన్నైలో సాయంత్రం 6 గంటలకు జరిగే 'పొన్నియన్ సెల్వన్' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోవచ్చని అంటున్నారు.
ఆయన ఎందువల్ల అస్వస్థతకు గురయ్యారనే విషయం ఇంతదాకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈలోపు ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ ప్రచారంలోకి వచ్చింది. ఇంకొందరు ఆయన హై ఫీవర్‌కు గురయ్యారనీ, దాని వల్లే హాస్పిటల్‌లో చేరారనీ అంటున్నారు. ఫ్యాన్స్, సెలబ్రిటీలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
ఈ రోజు 'పొన్నియిన్ సెల్వన్' ఈవెంట్‌కు హాజరు కాలేకపోయినా, సోమవారం జరిగే తన మరో సినిమా 'కోబ్రా' ప్రి రిలీజ్ ఈవెంట్‌కు విక్రమ్ హాజరవుతారని సమాచారం. మణిరత్నం రూపొందిస్తోన్న మాగ్నమ్ ఓపస్ 'పొన్నియిన్ సెల్వన్ 1' మూవీలో ఆయన ఆదిత్య కరికాలన్ పాత్రను చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 30న విడుదల కానున్నది.
![]() |
![]() |