Home

»

Latest News

`గూఢ‌చారి నెం.1`గా చిరు అల‌రించి 39 ఏళ్ళు!

Jun 30, 2022 12:05PM

మెగాస్టార్ చిరంజీవి కొన్ని స్పై మూవీస్ లో సంద‌డి చేశారు. వాటిలో `గూఢ‌చారి నెం.1` ఒక‌టి. ఇందులో సీబీఐ ఏజెంట్ విజ‌య్ గా త‌న‌దైన అభిన‌యంతో ఆక‌ట్టుకున్నారు చిరు. శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా రాధిక ద‌ర్శ‌న‌మివ్వ‌గా.. రావు గోపాల రావు, గొల్ల‌పూడి మారుతీరావు, భానుచంద‌ర్, ప్ర‌భాక‌ర్ రెడ్డి, సిల్క్ స్మిత‌, సాక్షి రంగారావు, మాడా వెంక‌టేశ్వ‌ర రావు, పి.ఎల్. నారాయ‌ణ, రాజా, జ‌య‌మాలిని, స‌త్య‌క‌ళ‌, కృష్ణ‌వేణి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించారు. కోడి రామ‌కృష్ణ క‌థ‌, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి స‌త్యానంద్ సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు.

చ‌క్ర‌వ‌ర్తి బాణీలు క‌ట్టిన‌ `గూఢ‌చారి నెం.1`కి వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి సాహిత్య‌మందించారు. ఇందులోని ``చిరు బుర్రు``, ``పిస్తా బ‌హ‌ర్``, ``స‌చ్చి నా క‌డుపున‌``, ``సిగ్గు ఓ అమ్మ‌``, ``వంగ‌తోట కాడ‌`` అంటూ మొద‌ల‌య్యే పాట‌లు రంజింప‌జేశాయి. విజ‌య‌ల‌క్ష్మీ ఆర్ట్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై టి. త్రివిక్ర‌మ రావు నిర్మించిన `గూఢ‌చారి నెం.1`.. 1983 జూన్ 30న విడుద‌లై ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. కాగా, నేటితో ఈ చిత్రం 39 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com