'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్స్ సైతం పుష్ప ఫీవర్ లో మునిగిపోయి 'తగ్గేదేలే' అంటూ బన్నీని ఇమిటేట్ చేశారు. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్న బన్నీ.. తన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మరోసారి చూపించాడు. గూగుల్ లో అత్యధిక మంది సెర్చ్ చేసిన సౌత్ హీరోల లిస్టులో బన్నీ టాప్ పొజిషన్ లో నిలిచాడు.
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో గూగుల్ లో అత్యధిక మంది సెర్చ్ చేసిన టాప్-100 ఏషియన్ సెలబ్రిటీల లిస్టు విడుదలైంది. అందులో సౌత్ నుంచి హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్, హీరోలలో బన్నీ టాప్ లో నిలిచారు. టాప్-100 లో సౌత్ స్టార్స్ కాజల్(15), సమంత(18), బన్నీ(19), రష్మిక(20), విజయ్(22), నయనతార(33), తమన్నా(37), యశ్(40), పూజ హెగ్డే(44), మహేష్ బాబు(47), రామ్ చరణ్(53), అనుష్క శెట్టి(56), జూనియర్ ఎన్టీఆర్(58), ధనుష్(61), కీర్తి సురేష్(62), సూర్య(63), ప్రభాస్(68), రజినీకాంత్(77), రకుల్(91) చోటు దక్కించుకున్నారు.
టాప్-100 ఏషియన్ సెలబ్రిటీల లిస్టులో ఓవరాల్ ఇండియా చూసుకుంటే సినీ సెలెబ్రిటీలలో లతా మంగేష్కర్(5), కత్రినా కైఫ్(7), ఆలియా భట్(8), ప్రియాంక చోప్రా(9), సల్మాన్ ఖాన్(11), షారుఖ్ ఖాన్(12) టాప్ లో నిలిచారు.