![]() |
![]() |

శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ - `భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్` సంస్థ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి కాంబినేషన్ లో పలు రీమేక్ సినిమాలు తెరకెక్కాయి. వాటిలో `మధురానగరిలో` ఒకటి. మలయాళ చిత్రం `ఇన్ హరిహర్ నగర్` (1990) ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నిరోషా, శ్రీకాంత్, చిన్నా, రవిశంకర్, రియాజ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శరత్ బాబు, సురేశ్ అతిథి పాత్రల్లో దర్శనమివ్వగా.. బాబూమోహన్, వై.విజయ, శుభ, బాలాజీ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. గణేశ్ పాత్రో సంభాషణలు సమకూర్చారు.
కథ విషయానికి వస్తే, `మధురానగరిలో` అనే కాలనీలో సరదాగా గడిపే నలుగురు కుర్రాళ్ళు.. అదే కాలనీలోకి కొత్తగా వచ్చిన మాయ అనే అమ్మాయి ఆకర్షణలో పడతారు. ఇంతకీ ఈ మాయ ఎవరు? ఆమె వెనుక కథ ఏంటి? అనేది మిగిలిన సినిమా.
మాతృకకి బాణీలు అందించిన ఎస్. బాలకృష్ణన్ తెలుగు వెర్షన్ కి కూడా సంగీతమందించగా.. వెన్నెలకంటి సాహిత్యమందించారు. నాగూర్ బాబు (మనో), శ్రీకుమార్ గాత్రమందించారు. 1991 జూన్ 21న విడుదలై జననీరాజనాలు అందుకున్న `మధురానగరిలో`.. నేటితో 31 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |