![]() |
![]() |

ప్రభాస్, దీపికా పడుకోనే జంటగా నటిస్తోన్న ప్రాజెక్ట్ కె షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకుడు. కొద్ది రోజుల క్రితం షూటింగ్ సెట్స్‌పై అస్వస్థతకు గురైన దీపిక హాస్పిటల్‌కు వెళ్లి చెకప్ చేయించుకొని వచ్చిన విషయం హెడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. సడన్‌గా ఆమెకు హార్ట్ బీట్ పెరగడంతో ఇబ్బంది పడిందనీ, అందుకే హాస్పిటల్‌కు వెళ్లిందనీ ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆమె అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆందోళనకు గురయ్యారు.
మరోవైపు ప్రభాస్ సైతం ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేవరకూ షూటింగ్‌ను వాయిదా వేయాల్సిందిగా దర్శక నిర్మాతలను కోరినట్లు కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దీపిక ఆరోగ్య స్థితిపై ప్రాజెక్ట్ కె నిర్మాత సి. అశ్వినీదత్ వివరణ ఇచ్చారు. కామినేని హాస్పిటల్‌కు దీపిక చెకప్‌కు వెళ్లడానికి కారణం.. ఆమెకు రక్తపోటు (బీపీ) సమస్య రావడం వల్ల అని ఆయన చెప్పారు. అయితే ఒక గంటలోనే ఆమె సాధారణ స్థితికి వచ్చి, షూటింగ్‌కు హాజరయ్యిందని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ యథావిధిగా నడుస్తోందనీ, దీపిక, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో సన్నివేశాలు తీస్తున్నామనీ ఆయన వెల్లడించారు.
దీపిక ప్రస్తుతం 'ప్రాజెక్ట్ కె' మూవీతో పాటు షారుక్ ఖాన్ సినిమా 'పఠాన్', హృతిక్ రోషన్ ఫిల్మ్ 'ఫైటర్'లో హీరోయిన్‌గా నటిస్తోంది.
![]() |
![]() |