![]() |
![]() |

'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కనున్నఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని మరో హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా నాని స్పందించాడు.
నాని హీరోగా నటించిన 'అంటే సుందరానికీ' మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తదుపరి సినిమాలపై నాని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను 'దసరా' సినిమాలో మాత్రమే నటిస్తున్నానని, మిగతా ప్రాజెక్ట్స్ చర్చల దశలోనే ఉన్నాయని తెలిపాడు. అలాగే 'SSMB28', 'దళపతి 66' సినిమాలలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజమే లేదని, అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో కూడా అర్థం కావట్లేదని నాని అన్నాడు.
![]() |
![]() |