Home

»

Latest News

ఆగ‌స్టులో కేథ‌రిన్ డ‌బుల్ ధ‌మాకా!

May 20, 2022 4:17PM

కేథ‌రిన్ ట్రెసా.. గ్లామ‌ర్ ప్రియుల‌కు ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ న‌టించింది త‌క్కువ చిత్రాల్లోనే అయినా.. అందాల విందుతో మంచి గుర్తింపునే పొందిందనే చెప్పాలి.

ఇదిలా ఉంటే, రీసెంట్ గా `భ‌ళా తంద‌నాన‌`తో మ‌రో ఫ్లాప్ ని త‌న ఖాతాలో వేసుకున్న కేథ‌రిన్.. రానున్న ఆగ‌స్టులో ఇంకోసారి అదృష్ట‌ప‌రీక్ష‌కు సిద్ధ‌మైంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. రెండు వ‌రుస వారాల్లో కేథ‌రిన్ న‌టించిన తెలుగు చిత్రాలు తెర‌పైకి రాబోతున్నాయి. ఆ సినిమాలే.. `బింబిసార‌`, `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కి జంట‌గా కేథ‌రిన్ న‌టించిన `బింబిసార‌` ఆగ‌స్టు 5న విడుద‌ల కానుండ‌గా.. యూత్ స్టార్ నితిన్ కి జోడీగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం` ఆగ‌స్టు 12న జ‌నం ముందుకు రాబోతోంది. గ‌మ్మ‌త్తేమిటంటే.. ఈ రెండు సినిమాల‌ను కూడా డెబ్యూ డైరెక్ట‌ర్స్ రూపొందిస్తుండ‌గా.. రెండింటిలోనూ మ‌రో హీరోయిన్ కూడా ఉంది. మ‌రి.. ఆగ‌స్టులో వ‌రుస వారాల్లో రాబోతున్న `బింబిసార‌`, `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం`తో కేథ‌రిన్ ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com