![]() |
![]() |

తండ్రీకొడుకులు చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' మూవీ విడుదలై 8 రోజులు గడిచాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్లు రోజురోజుకూ దిగజారుతూ రావడం చూస్తున్నాం. ప్రి బిజినెస్ వాల్యూతో పోలిస్తే 'ఆచార్య' లైఫ్‌టైమ్ వసూళ్లు మూడింట ఒక వంతు మాత్రమే ఉండేలా కనిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమా టాలీవుడ్‌లో అతి పెద్ద డిజాస్టర్‌గా రికార్డులకెక్కడం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎనిమిది రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఆచార్య' వసూలు చేసింది రూ. 40.57 కోట్ల షేర్.
తెలంగాణలో రూ. 12.30 కోట్లను కలెక్ట్ చేసిన ఈ మూవీ రాయలసీమలో రూ. 6.15 కోట్లను, ఆంధ్రాలో రూ. 22.16 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సినిమా వసూలు చేసింది రూ. 48.10 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఎక్కువ సెంటర్లలో భారీ నష్టాలను మూటగట్టుకోవడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం పెదవి విరిచిన ఈ సినిమా టాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలవబోతోంది.
అంతదాకా నాలుగు సినిమాలు తీసి ఓటమి ఎరుగని డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ డైరెక్షన్‌లో చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్నారనేసరికి 'ఆచార్య'పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలన్నీ సినిమా విడుదల తర్వాత తలకిందులైపోయాయి. తొలి షో నుంచే నెగటివ్ టాక్ రావడం, విమర్శకులు తెగడడం తగ్గట్లుగానే బాక్సాఫీస్ రిజల్ట్ కనిపించింది.
యాక్షన్ డ్రామాగా రూపొందిన 'ఆచార్య'లో సోను సూద్, జిషు సేన్‌గుప్తా విలన్లుగా నటించగా, చరణ్ జోడీగా పూజా హెగ్డే నటించింది.
![]() |
![]() |