![]() |
![]() |

ఇటీవల వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి అత్యధిక గ్రాస్ రాబట్టిన ఇండియన్ సినిమాల లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచిన 'కేజీఎఫ్ చాప్టర్-2' తాజాగా 1100 కోట్ల క్లబ్ లో చేరింది. త్వరలోనే 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్స్(42 రోజుల్లో రూ.1127 కోట్ల గ్రాస్)ని దాటేసి మూడో స్థానంలో నిలిచే అవకాశముంది.
వరల్డ్ వైడ్ గా రూ.345 కోట్ల బిజినెస్ చేసిన కేజీఎఫ్-2 మూవీ 22వ రోజు 6.36 కోట్ల షేర్(12.60 కోట్ల గ్రాస్) రాబట్టి ఓవరాల్ గా ఇప్పటిదాకా 548.16 కోట్ల షేర్(1109.70 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఇప్పటికే బయ్యర్లకు 200 కోట్లకు పైగా ప్రాఫిట్స్ మిగిల్చింది. 22 రోజుల్లో కర్ణాటకలో 98.35 కోట్లు(100 కోట్లు బిజినెస్), తెలుగు రాష్ట్రాల్లో 81.26 కోట్లు(78 కోట్లు బిజినెస్), తమిళనాడు 48.40 కోట్లు(27 కోట్లు బిజినెస్), కేరళ 28.75 కోట్లు(10 కోట్లు బిజినెస్), హిందీ+రెస్టాఫ్ ఇండియా 202.35 కోట్లు(100 కోట్లు బిజినెస్), ఓవర్సీస్ 89.05 కోట్ల(30 కోట్లు బిజినెస్) షేర్ రాబట్టి దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 22వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 36 లక్షల షేర్ వసూలు చేసిన కేజీఎఫ్-2 ఇప్పటిదాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 81.26 కోట్ల షేర్(131.30 కోట్ల గ్రాస్) రాబట్టింది. నైజాంలో 25 కోట్ల బిజినెస్ చేయగా 22 రోజుల్లో 41.78 కోట్ల షేర్ కలెక్ట్ చేసి భారీ లాభాలను రాబడుతోంది. అయితే ఆంధ్రా, సీడెడ్ లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. సీడెడ్ 14 కోట్ల బిజినెస్ చేసిన మూవీ ఇప్పటిదాకా 11.48 కోట్ల షేర్ సాధించింది. ఆంధ్రాలో ఓవరాల్ గా 39 కోట్ల బిజినెస్ చేయగా 22 రోజుల్లో 28 కోట్ల షేర్ రాబట్టింది.
![]() |
![]() |