Home

»

Latest News

20 ఏళ్ళ `లాహిరి లాహిరి లాహిరిలో`!

Apr 30, 2022 5:07PM

మ్యూజిక‌ల్ ఎంట‌ర్టైన‌ర్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన ద‌ర్శ‌కుల్లో వైవీఎస్ చౌద‌రి ఒక‌రు. `బొమ్మ‌రిల్లు వారి` ప‌తాకంపై త‌నే స్వ‌యంగా నిర్మిస్తూ క‌థ‌, స్క్రీన్ ప్లే అందించి మ‌రీ చౌద‌రి తెర‌కెక్కించిన `లాహిరి లాహిరి లాహిరిలో` (2002) కూడా అప్ప‌ట్లో మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఆదిత్య ఓమ్, అంకిత ని హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ హ‌రికృష్ణ‌, సుమ‌న్, వినీత్, భానుప్రియ‌, ర‌చ‌న‌, సంఘ‌వి, కె. విశ్వ‌నాథ్, ల‌క్ష్మి, స‌త్య‌ప్రియ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా వైవీఎస్ రూపొందించిన‌ `లాహిరి లాహిరి లాహిరిలో`.. అటు యువ‌తరాన్ని, ఇటు కుటుంబ ప్రేక్ష‌కుల‌ను భ‌లేగా ఆక‌ట్టుకుంది. ``ఒక్క‌సారి ప్రేమించి చూడండి`` అంటూ నాలుగు జంట‌ల ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కించిన ఈ సినిమాకి చింత‌ప‌ల్లి ర‌మ‌ణ స‌మ‌కూర్చిన సంభాష‌ణ‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

దిగ్గ‌జ గీత ర‌చ‌యిత `సిరివెన్నెల‌` సీతారామ‌శాస్త్రి క‌లం నుంచి జాలువారిన పాట‌ల‌కు స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు క‌ట్టారు. ఇందులోని ``క‌ళ్ళ‌లోకి క‌ళ్ళుపెట్టి చూడ‌లేకున్నా`` చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలవ‌గా.. ``లాహిరి లాహిరి లాహిరిలో``, ``నేస్త‌మా``, ``వీర‌వెంక‌ట‌``, ``మంత్ర‌మేదో``, ``ఓహోహో చిల‌క‌మ్మా``, ``కిల్ మిరే``, ``మ‌న‌సే` (బిట్ సాంగ్స్) కూడా రంజింప‌జేశాయి. `బెస్ట్ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్` (హ‌రికృష్ణ‌), `బెస్ట్ క్యారెక్ట‌ర్ యాక్ట్ర‌స్` (భానుప్రియ‌), `బెస్ట్ ఫిమేల్ క‌మెడీయ‌న్` (ర‌మాప్ర‌భ‌) విభాగాల్లో `నంది` పుర‌స్కారాల‌ను అందుకున్న `లాహిరి లాహిరి లాహిరిలో`.. 2002 మే 1న విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. కాగా, ఈ ఆదివారంతో ఈ మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ 20 వ‌సంతాలు పూర్తిచేసుకుంటోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com