![]() |
![]() |
.webp)
చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' సినిమాకు ఇప్పటికే తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకోవడానికి కేసీఆర్ సర్కార్ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మొదటి వారం రోజులు థియేటర్ ని బట్టి రూ.30 నుంచి రూ.50 వరకు పెంచుకేనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లో సైతం టికెట్ ధరలు పెంచుకోవడానికి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆచార్యకు మొదటి పదిరోజులు టికెట్ కి రూ.50 చొప్పున పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. నిజానికి కొద్దిరోజుల క్రితం వరకు ఏపీలో టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. టికెట్ ధరలను తగ్గిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో సినీ పరిశ్రమ బాగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన చిరంజీవి.. చేతులు జోడించి మరీ జగన్ ని దిగొచ్చేలా చేశారు. దీంతో టికెట్ ధరలు కాస్త పెంచింది ప్రభుత్వం. అలాగే భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి పదిరోజులు మరింత పెంచుకునేందుకు ఓకే చెప్పింది. అయితే రెమ్యునరేషన్స్ కాకుండా బడ్జెట్ 100 కోట్ల పైగా ఉండాలని, అలాగే ఏపీలో కనీసం 20 శాతం షూటింగ్ జరిగుండాలని కండీషన్స్ పెట్టింది. మరి ఇప్పుడు ఆ కండీషన్స్ ప్రకారమే ఆచార్యకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి ఇండస్ట్రీ మంచి కోసం ముందడుగు వేసిన చిరంజీవికి.. తాజా జగన్ సర్కార్ నిర్ణయంతో తన సినిమాకి కూడా మంచి జరిగింది. అయితే గత నెలలో విడుదలైన 'రాధేశ్యామ్'కి 25 మాత్రమే పెంచి, 'ఆచార్య'కు 50 పెంచడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ పరంగా రాధేశ్యామ్ కంటే ఆచార్య తక్కువ అయినప్పటికీ 50 రూపాయలు పెంచడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు.
![]() |
![]() |