![]() |
![]() |
.webp)
మంచు విష్ణు హీరోగా 'గాలి నాగేశ్వరరావు' అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రేణుక అనే పాత్రలో బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న సన్నీ.. సెట్ లో విష్ణుతో కలిసి ఫన్నీ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఇక తాజాగా విష్ణు ఇంట్లో సన్నీ వంటలక్క అవతారమెత్తింది.
సన్నీకి మంచు ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది. మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' సినిమాలో 'అమ్మాయి నడుము' అనే స్పెషల్ లో చిందేసి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు విష్ణు మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుంది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి విష్ణుతో ఉన్న ఫ్రెండ్ షిప్ ని సన్నీ బయటపెడుతూనే ఉంది. షూటింగ్ లొకేషన్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ని షేర్ చేసిన సన్నీ.. తాజాగా విష్ణుతో కలిసి పరోటాలు చేసిన వీడియోని పంచుకుంది.
.webp)
హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ.. అచ్చ తెలుగు అమ్మయిలా లంగావోణీ ధరించి వంట చేయడం ఆకట్టుకుంటోంది. అంతేకాదు పరోటా టేస్ట్ చూసి 'దీనెక్క అదిరిపోయింది' అంటూ సన్నీ చేత తెలుగులో చెప్పించాడు విష్ణు. వచ్చీ రానీ సన్నీ అలా చెప్పడం సరదాగా ఉంది. ప్రస్తుతం విష్ణు-సన్నీ ల పరోటా మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![]() |
![]() |