![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' సినిమాకి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. ఇద్దరూ చెరొక రూ.50 కోట్లు తీసుకున్నారని, లేదు ఒక్కొక్కరూ 100 కోట్లు తీసుకున్నారని ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే 'ఆర్ఆర్ఆర్'కి తారక్, చరణ్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో అని డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా తెలుసుకోవాలి అనిపించింది. అనిపించడమే కాదు చరణ్ ని అడిగేశాడు కూడా. అయితే చరణ్ మాత్రం తన రెమ్యూనరేషన్ కూడా తారకే మాట్లాడాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మార్చి 25 న 'ఆర్ఆర్ఆర్' విడుదల అవుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అనిల్ రావిపూడి ఆర్ఆర్ఆర్ టీమ్ ని ఇంటర్వ్యూ చేశాడు. ఎంతో సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒక ఫన్నీ టాస్క్ లో భాగంగా 'ఆర్ఆర్ఆర్'కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో చెప్పాలని చరణ్ ని అనిల్ అడగగా.. "ఇద్దరి రెమ్యూనరేషన్స్ తారకే మాట్లాడాడు" అంటూ చరణ్ సరదాగా సమాధానం చెప్పాడు.
ఇంతలో రాజమౌళి కల్పించుకొని " వీళ్ళ ఫ్రెండ్ షిప్ అక్కడే స్టార్ట్ అయినట్లు ఉంది. ఇద్దరి రెమ్యూనరేషన్స్ సేమ్ నువ్వే మాట్లాడు.. అని ముందే ఫిక్స్ అయినట్లు ఉన్నారు. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది" అని నవ్వుతూ చెప్పాడు.
![]() |
![]() |