Home  »  News  »  ఒకేసారి 20 ఓటీటీ ప్లాట్ ఫాంలలో రిలీజ్.. పూనమ్ కౌర్ సంచలన రికార్డ్

Updated : Mar 8, 2022

వై2కె సమస్య కారణంగా హైద‌రాబాద్‌లోని ఓ కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘నాతిచరామి’. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి.కె నిర్మించారు. నాగు గవర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రికార్డ్ స్థాయిలో అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. "ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీ మీదైనా చిన్న కన్నేసినా వాడు రాక్షసుడే.. కాలం ఏదైనా కథ ఇదే.. సీతాదేవి, ద్రౌపది, దుర్గా దేవి ల కథలు చదివాను. వీరంతా కూడా సమాజంలో చాలా ఫైట్ చేసి బిగ్ ఛాలెంజ్ ను ఎదుర్కొన్నారు. నేను చెన్నై లో ఉండగా దర్శకుడు నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నా జీవితానికి గగ్గరగా ఉన్న కథ 'నాతి చరామి'. 2007 లోనే పెళ్లి చేసుకొని అబ్రాడ్ కు వెళ్ళాలి అనుకున్నాను. కానీ సినిమానే నా జీవితం అయిపోయింది. చాలా మంది మద్య తరగతి నుండి వచ్చిన అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయి. అవి అందరికీ నెరవేరవు. అయితే వారంతా వారి బలమేంటి, బలహీనతలేంటి తెలుసుకొని ఎంతో మనో ధైర్యంతో స్ట్రెన్త్ తెచ్చుకొని ముందుకెళ్లాలి. అప్పుడే సక్సెస్ సాధిస్తారు. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది. భార్య భర్తల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాలో చాలా బావుంటాయి. ఇలాంటి మంచి కథకు నన్ను సెలెక్ట్ చేసుకొన్న దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది" అన్నారు.

చిత్ర దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. "అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి.. ముగ్గురి పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ‘నాతిచరామి’. 1999,2000 ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా, రూపొందించిన చిత్రమిది. ఇక్కడ జరిగిన క్రైమ్ కంటే దీని చుట్టూ జరిగిన డ్రామా నచ్చింది. ఈ కథకు సరైన యాక్టర్ ఉంటే ఈ కథను పవర్ ఫుల్ గా చెప్పచ్చు.అనిపించి శ్రీలత క్యారెక్టర్ ను డిజైన్ చేసుకొని ఈ కథకు పూనమ్ కౌర్ అయితే బాగుంటుందని తనకి ఈ కథ చెప్పడం జరిగింది. ఇంతవరకు తను చేయని రోల్ ఇది. ఇందులో తను చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇందులో ఉన్న కంటెంట్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.సినిమా చూసి బయటికి వచ్చిన తరువాత కూడా శ్రీలత క్యారెక్టర్ మీ వెంట వస్తుంది." అన్నారు.

నటుడు అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. "నా కెరీర్ లో 'నాతిచరామి' వెరీ స్పెషల్ ఫిల్మ్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ఇలాంటి రోల్స్ చాలా తక్కువ వస్తాయి. నాతి చరామి అంటేనే ప్రామిస్..ఒక వైఫ్ & హుస్బెండ్ ఆ ప్రామిస్ ను అప్ హోల్డ్ చేయడానికి ఎంతదూరం వెళ్తారు. దానివల్ల వచ్చిన పరిణామాలేంటి అనేది ఈ సినిమాలో దర్శకుడు నాగు చాలా చక్కగా చెప్పాడు. ఈ సినిమా చూసిన వారందరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు" అన్నారు.

నటుడు సందేశ్ బురి మాట్లాడుతూ.. "ఇందులో నా పాత్రను నాగు గారు చాలా చక్కగా డిజైన్ చేశారు.నా జీవితంలో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. నాతో అరవింద్, పూనమ్ లు చాలా చక్కగా నటించారు.పాత్రలు తక్కువ ఉన్నా అద్భుతమైన పెరఫార్మెన్స్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా మిమ్మల్నందరినీ అలరిస్తుంది." ఆన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.