![]() |
![]() |

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. అంతేకాదు ఆయన షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు.
యంగ్ హీరోలకి కూడా సాధ్యం కాని స్పీడ్ లో చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరేడు సినిమాలున్నాయి. అయితే ఆయన స్పీడ్ కి కరోనా రెండు వారాల బ్రేక్ వేసింది. కరోనా సోకడంతో ఆయన రెండు వారాలు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఆయన మళ్ళీ యాక్షన్ మొదలెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ తెలియజేశారు. మీ అందరి ప్రేమతో తాను కోలుకున్నానని, మళ్ళీ యాక్షన్ లోకి దిగానని చిరంజీవి ట్వీట్ చేశారు.
మెగాస్టార్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వేదాళం రీమేక్ భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, వెంకీ కుడుముల ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆచార్య' ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |