![]() |
![]() |

డైరెక్టర్ కిషోర్ తిరుమల, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి' సినిమాలు మ్యూజికల్ గా మంచి హిట్ అయ్యాయి. దీంతో వీరి కాంబినేషన్ లో వస్తున్న 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' మూవీ సాంగ్స్ పై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
శర్వానంద్, రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ఈ మూవీ టైటిల్ సాంగ్ ని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. డీఎస్పీ సంగీతం అందించడంతో పాటు స్వయంగా పాడిన ఈ పాట ఆకట్టుకుంటోంది. శ్రీమణి అందించిన లిరిక్స్ క్యాచీగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓ వైపు 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' అంటూనే.. మరోవైపు తన పెళ్లికి అడ్డుపడుతున్న ఆడవారిని ఉద్దేశించి 'నీ మొగుడు ఏమన్నా మహేష్ బాబా?', 'నువ్వేమన్నా కత్రినా కైఫా?' అంటూ హీరో పాడటం ఆకట్టుకుంది.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |